వాహనదారులకు బిగ్ అలర్ట్.. బ్రిడ్జిపై ఒకవైపు మాత్రమే రాకపోకలకు అనుమతి
తూర్పు గోదావరి జిల్లా గామన్ బ్రిడ్జికి మళ్లీ మరమ్మతులు ప్రారంభించారు. బ్రిడ్జిలోని 28వ పిల్లర్ దగ్గర బేరింగ్ లోపం రావడంతో మరమ్మతులు షురూ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా గామన్ బ్రిడ్జికి మళ్లీ మరమ్మతులు ప్రారంభించారు. బ్రిడ్జిలోని 28వ పిల్లర్ దగ్గర బేరింగ్ లోపం రావడంతో మరమ్మతులు షురూ చేశారు. దీంతో ఈ రోజు నుంచి మే 3వ తేదీ వరకు అధికారులు రాకపోకలు బంద్ చేశారు. ఒకవైపు మాత్రమే వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. కాగా, రాజమహేంద్రవరం-కొవ్వూరు మధ్య ఉన్న గామన్ బ్రిడ్జి నెల రోజుల వ్యవధిలో మరోసారి మరమ్మతులకు గురైంది. మార్చి 24న గామన్ బ్రిడ్జి 52వ స్తంభం వద్ద వంతెనకు యాక్షన్ ఇచ్చే బాల్ మరమ్మతులకు గురి కావడంతో వంతెనపై ఒకవైపు రాకపోకలను నిలుపుదల చేశారు. మరమ్మతులు పూర్తిచేసి సుమారు నెల రోజుల తరువాత ఈ నెల 23న రెండువైపులా వాహన రాకపోకలను అనుమతించారు. అయితే ప్రస్తుతం 28వ స్తంభం వద్ద అమర్చిన బేరింగ్‌లో లోపం రావడంతో ఈ నెల 26 నుంచి మే 3వ తేదీ వరకు ఈ మార్గంలో వాహన రాకపోకలను నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటించారు. రాకపోకలు ప్రారంభించిన పదేళ్లకే మరమ్మతులకు గురి కావడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.