మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో కీలకపరిణామం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొద్ది నెలల క్రితం జరిగిన.. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొద్ది నెలల క్రితం జరిగిన.. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు(Madanapalli files burning case) సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మదనపల్లి(Madanapalli) సబ్ కలెక్టర్ కార్యాలయం(Sub Collector Office)లో మంటలు చెలరేగడంతో పలు కీలక ఫైళ్లు తగలబడినట్లు తెలపగా.. ప్రమాదం వెనుక కుట్ర కోణం(Conspiracy angle) ఉందని.. పోలీసుల విచారణలో తేలింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలో నేడు.. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో కీలకపరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడి(main accused)గా ఉన్న గౌతమ్‌తేజ్(Gautam Tej)ను సీఐడీ పోలీసులు(CID Police) పలమనేరులో అరెస్ట్(Arrest) చేశారు. అనంతరం అతన్ని.. చిత్తూరు కోర్టు(Chittoor Court)లో హాజరుపరిచారు. దీంతో గౌతమ్‌తేజ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్(Remand) విధించగా.. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన సీఐడీ పోలీసులు జైలుకు తరలించినట్లు తెలుస్తోంది.