వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ వీసీగా డా.కోరుకొండ బాబ్జీ

డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సీటి వైస్ చాన్సలర్ గా ప్రముఖ న్యూరో సర్జన్ కోరుకొండ బాబ్జీ ఎంపికయ్యారు.

Update: 2023-02-11 10:44 GMT

దిశ, కాజులూరు: డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సీటి వైస్ చాన్సలర్ గా ప్రముఖ న్యూరో సర్జన్ కోరుకొండ బాబ్జీ ఎంపికయ్యారు. సుదీర్గ కాలం నుంచి వైద్య రంగంలో ఉత్త మ సేవలు అందిస్తున్న బాబ్జీకి తగిన గుర్తింపు లబించిందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాజులూరు మండలం శీల అనే చిన్న కుగ్రామంలో జన్నించిన కోరుకొండ బాబ్జీ.. చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డారు. తండ్రి సుబ్బారావు అప్పట్లో శీల గ్రామానికి రిజర్వేషన్ కోటాలో సర్పంచిగా సేవలందించారు. తన గ్రామానికి రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న కాజులూరు ఉన్నత పాఠాశాలకు కాలినడకన వచ్చి విద్యాభ్యాసం చేసేవారు. అనేక కష్టాలు పడి ఆయన వైద్య డిగ్రీ చేతపట్టారు. తొలినాళ్లలో కొంత కాలం ప్రైవేటుగా ప్రాక్టీస్ చేసిన అనంతరం కాకినాడ జీజీహచ్ లో ఉద్యోగం వచ్చించి . తర్వాత అదే జీజీహచ్ కు సూపరెండెంటుగా కూడా సేవలు అందించారు.

రంగరాయ మెడికల్ కళాశాలలో ప్రిన్సిపాల్ గా కూడా సేవలు అందించారు. ప్రస్తుతం కాకినాడలో నివాసం ఉంటున్న ఇతను .. సొంత గ్రామం శీలకు అనేక సేవా కార్యక్రమాలు చేశారు. మెడికల్ క్యాంపులు అదిక సంఖ్యలో పెట్టారు. పేద విద్యార్దులకు తోడ్పాటు నిచ్చారు. తాజాగా బాబ్జీ ఎంపిక పట్ల శీలలో సంబరాలు వ్యక్తం చేస్తున్నారు. శీల సర్పంచి కోమలి వెంకటరమణ, ఆక్వా రైతు రామారెడ్డి, యంపిటీసి దడాల బీమేశ్వర్రావు, యంపిపి మాతా బారతి, జడ్పీటీసీ వనుం సుబ్బారావు, మాతా నూకారావు, తదితరులు హర్షం వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు.

Tags:    

Similar News