AP TET Exams: ఏపీలో రేపటి నుంచి ప్రారంభం కానున్న టెట్ ఎగ్జామ్స్..అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే ..

ఆంధ్ర ప్రదేశ్‌(AP)లో రేపటి నుంచి టీచర్ ఎలిజిబిటీ టెస్ట్(TET) పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Update: 2024-10-02 16:44 GMT

దిశ, వెబ్‌డెస్క్:ఆంధ్ర ప్రదేశ్‌(AP)లో రేపటి నుంచి టీచర్ ఎలిజిబిటీ టెస్ట్(TET) పరీక్షలు ప్రారంభం కానున్నాయి.ఈ పరీక్ష నిర్వహణకు సంబధించి ఏపీ పాఠశాల విద్యాశాఖ(AP School Education Department) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.ఈ నెల 3 నుంచి 21 వరకు రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.మొదటి సెషన్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి.కాగా ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) విధానంలో నిర్వహించనున్నట్టుగా విద్యాశాఖ ఇదివరకే ప్రకటించింది.దాదాపు 4 లక్షల మంది అభ్యర్థులు టెట్ పరీక్షలకు హాజరు కానున్నట్టు తెలుస్తోంది.ఈ పరీక్షలకు హాజరయ్యే వికలాంగుల (Disabled Persons)కు అదనంగా 50 నిమిషాల సమయం కేటాయిస్తారు.సొంతంగా పరీక్షలు రాయలేని 813 మంది వికలాంగులు పరీక్ష రాయడానికి సహాయకులను ఏర్పాటు చేసుకున్నారు.ఇప్పటివరకు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొని వారు వెంటనే (https://aptet.apcfss.in) వెబ్‌సైట్‌ నుండి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవాలి. 

టెట్ ఎగ్జామ్ రూల్స్ ఇవే ..

  • పరీక్షా సమయానికి గంటన్నర ముందుగానే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
  • అభ్యర్థులు తప్పనిసరిగా ఆధార్‌ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు గుర్తింపుకార్డుల్లో ఏదో ఒకటి తీసుకెళ్లాలి.
  • అభ్యర్థులు ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ హాల్ టికెట్లను పొంది ఉంటే ఏదో ఒక కేంద్రంలోనే పరీక్ష రాయాలి.
  • హాల్ టికెట్ పైన ఫోటో లేకపోయినా, సరిగా కనపడకపోయినా..పరీక్షా కేంద్రంలోని డిపార్టుమెంట్ అధికారికి రెండు పాస్ పోర్టు సైజు ఫోటోలు సమర్పించాలి.
  • అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను తమతో తీసుకువెళ్లడానికి అనుమతించరు.  

Similar News