చంద్రబాబుకు బిగ్ రిలీఫ్: ఏపీ ఫైబర్‌నెట్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

Update: 2023-11-30 09:08 GMT

దిశ , డైనమిక్ బ్యూరో : ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ అనిరుద్ బోస్ , జస్టిస్ బేలా ఎం త్రివేదిల నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ కేసుపై విచారణ జరిపింది. ఇరువాదనలు విన్న ధర్మాసనం డిసెంబర్ 12కు విచారణను వాయిదా వేసింది. అప్పటి వరకు చంద్రబాబు నాయుడుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. గతంలో జారీ చేసిన ఆదేశాలే ఇప్పుడు కూడా కొనసాగుతాయని సుప్రీంకోర్టు వెల్లడించింది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పైతీర్పు రాస్తున్నట్లు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. డిసెంబర్ 12 తేదీలోపు స్కిల్ స్కాం కేసులో తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పు తరువాత ఫైబర్ నెట్ కేసు విచారిస్తామని గతంలో ధర్మాసనం పేర్కొంది. ఇందులో భాగంగా డిసెంబర్ 12లోపు స్కిల్ స్కాం కేసులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News