Breaking: ఏపీలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల వాయిదా
రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఈ రోజు సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని భావించారు...
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఈ రోజు సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని భావించారు. అయితే రాష్ట్రంలో జరిగిన కొన్ని ఘటన వల్ల ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఆర్థిక, ఎక్సైజ్ శాఖపై శ్వేత పత్రాలను నేరుగా అసెంబ్లీ సమావేశాల్లో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈమేరకు ప్రకటన విడుదల చేశారు. కాగా గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాలపై చంద్రబాబు ఇప్పటికే పలు శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలను విడుదల చేశారు. తాజాగా శాంతి భద్రతలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.