రాష్ట్రంలో బార్ల వేలం కోసం ఎక్సైజ్‌శాఖ రీనోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్‌లోని 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్‌శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది.
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని 53 బార్ల వేలం(53 Bar Auctions) కోసం ఎక్సైజ్‌శాఖ రీనోటిఫికేష(Excise Department)న్ విడుదల చేసింది. కాగా ఈ నోటిఫికేషన్ ప్రకారం నేటి నుంచి డిసెంబర్ 17 నుంచి ఆన్ లైన్‌లో ఆశావాహులు దరఖాస్తుల స్వీకరణ(Receipt of applications)కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ బార్ల వేలం కోసం డిసెంబర్ 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా ప్రభుత్వం నిర్ణయించింది. కాగా సదరు బార్ల వేలం(Bar auction) కోసం వచ్చిన దరఖాస్తులను ఈ నెల 23న పరిశీలిస్తారు. ఈ నెల 24న ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ౧౨ గంటల వరకూ వేలం నిర్వహిస్తారు. వేలంలో బార్ దక్కించుకున్న వారికి అధికారులు లైసెన్సులు జారీ చేయనున్నారు. కాగా గతంలో ఒకసారి ఈ 53 బార్ల వేల కోసం నోటిఫికేషన్ వచ్చినప్పటికి దానిని రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా ఈ రీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.