ఏపీకి చేరుకున్న రాష్ట్రపతి ముర్ము.. స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్‌

భారత రాష్ట్రపతి(President) ద్రౌపది ముర్ము(Draupadi Murmu) తన పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) చేరుకున్నారు.

Update: 2024-12-17 06:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత రాష్ట్రపతి(President) ద్రౌపది ముర్ము(Draupadi Murmu) తన పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు రాష్ట్రపతి చేరుకోగా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎంపీలు, బీజేపీ నేతలకు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము ఎయిర్ పోర్టు నుంచి నేరుగా మంగళగిరి బయలుదేశారు. కాగా ఈ రోజు జరిగే ఎయిమ్స్ స్నాతకోత్సవాని(AIIMS graduation ceremony)కి ముర్ము హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు పాల్గోననున్నారు.


Similar News