Vijayawada: బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన ఆర్బీఐ.. ఖాతాదారుల ఆందోళన

విజయవాడలోని దుర్గా కో ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ ను ఆర్బీఐ రద్దు చేసింది. నిన్నటితోనే బ్యాంక్ కార్యకలాపాలు ఆగిపోయాయని, కస్టమర్లు లావాదేవీలు జరపవద్దని తెలిపింది.

Update: 2024-11-13 09:26 GMT

దిశ, వెబ్ డెస్క్: దుర్గా కో-ఆపరేటివ్ బ్యాంక్ (Durga Co-operative Bank) లైసెన్సును రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ (RBI) ప్రకటించింది. కొంతకాలంగా బ్యాంక్ లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు ఆర్బీఐ గుర్తించింది. కస్టమర్ల నుంచి డిపాజిట్లు తీసుకున్న బ్యాంక్.. వాటి గడువు తీరినా తిరిగి చెల్లించలేదని విచారణలో వెల్లడైంది. బ్యాంక్ కనీస బ్యాలెన్స్ ను మెయింటెన్ చేయడం లేదని, ఆదాయ మార్గాలు లేవని, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 నిబంధనలు కూడా పాటించడం లేదని, అందుకో రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. నిన్నటితో ఈ బ్యాంక్ సేవలు ఆగిపోయాయని, కస్టమర్లు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించొద్దని స్పష్టం చేసింది.

దుర్గా కో ఆపరేటివ్ బ్యాంకు లైసెన్సు రద్దయిందని (Bank License Cancelled) తెలియడంతో ఖాతాదారులు భారీగా బ్యాంకు వద్దకు చేరుకుంటున్నారు. బ్యాంక్ లైసెన్స్ రద్దయినా.. ఖాతాదారులు తమ డిపాజిట్లను క్లెయిమ్ చేసుకోవచ్చు. డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ద్వారా.. ప్రతి ఖాతాదారుడు రూ.5 లక్షల వరకూ ఇన్సూరెన్స్ పొందవచ్చు. 2024, ఆగస్టు 31 నాటి వరకూ ఉన్న లెక్కల ప్రకారం రూ.9.84 కోట్ల డిపాజిట్లను డీఐసీజీసీ చెల్లించినట్లు ఆర్బీఐ తెలిపింది. 

Tags:    

Similar News