జనసేన బహ్రెయిన్ కన్వీనర్‌గా రాయుడు వెంకటేశ్వరరావు
జనసేన పార్టీ బహ్రెయిన్ ప్రాంతీయ కన్వీనర్‌గా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడు లంక గ్రామానికి చెందిన రాయుడు వెంకటేశ్వరరావును నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: జనసేన పార్టీ బహ్రెయిన్ ప్రాంతీయ కన్వీనర్‌గా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడు లంక గ్రామానికి చెందిన రాయుడు వెంకటేశ్వరరావును నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. జనసేన పార్టీ గల్ఫ్ దేశాల ప్రాంతీయ కన్వీనర్లను నియమిస్తూ గురువారం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో భాగంగా బెహ్రయిన్‌లో ఉద్యోగరీత్యా స్థిరపడిన రాయుడు వెంకటేశ్వరరావు గల్ఫ్ దేశాల జనసేన పార్టీ కార్యకలాపాల్లో చురుకైన పాత్రను పోషిస్తున్నారు.
ఇటీవల గల్ఫ్ దేశాల నుంచి విరాళాలు సేకరించి జనసేన పార్టీ నిధికి రూ.కోటి అందజేశారు. పార్టీ కార్యకర్తలు చురుకుగా పాల్గొంటున్న రాయుడు వెంకటేశ్వరరావు సేవలను పార్టీ గుర్తించి బహ్రెయిన్ ప్రాంతీయ కన్వీనర్‌గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బహ్రెయిన్ ప్రాంతీయ కన్వీనర్‌గా నియమితులైన రాయుడు వెంకటేశ్వర రావును కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్‌తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు అభినందించారు.