Kakinada Port! : కాకినాడ పోర్టులో మళ్లీ రేషన్ బియ్యం కలకలం !

ఏపీ కాకినాడ పోర్టు(Kakinada Port)లో మరోసారి రేషన్ బియ్యం(Ration rice) అక్రమ రవాణ వ్యవహారం వెలుగుచూడటం సంచలనంగా మారింది.

Update: 2024-12-15 08:50 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ కాకినాడ పోర్టు(Kakinada Port)లో మరోసారి రేషన్ బియ్యం(Ration rice) అక్రమ రవాణ వ్యవహారం వెలుగుచూడటం సంచలనంగా మారింది. పోర్టు నుంచి ఎగుమతికి సిద్దంగా ఉన్న బియ్యం కంటైనర్ల సమాచారం అందుకున్న అధికారులు వాటిని తనిఖీ చేపట్టారు. దాదాపుగా 142 కంటైనర్లలో ఎగుమతికి సిద్ధంగా ఉంచిన బియ్యం బస్తాలు ఉన్నాయి. సమాచారం అందుకున్న జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఇతర అధికారులు కాకినాడ డీప్ వాటర్ పోర్టులో లోని కంటైనర్ల యాడ్ కి వెళ్లి కంటైనర్లలోని బియ్యాన్ని పరిశీలించారు. అవి రేషన్ బియ్యం అవునో కాదో తేల్చేందుకు బియ్యం నమూనాలను సేకరించి టెస్టింగ్ కోసం ల్యాబ్ కి పంపించారు.

కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం విదేశాలకు అక్రమంగా రవాణా అవుతున్న వ్యవహారం రచ్చగా మారింది. నవంబర్ 27న కాకినాడ జిల్లా కలెక్టర్ స్టెల్లా షిప్ లో 640టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లుగా ప్రకటించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నవంబర్ 29న కాకినాడ పోర్టులను సందర్శించి అక్కడి భద్రతా వైఫల్యాలు, కీలక శాఖల నిఘా లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేసి, సీజ్ ద షిప్ అని ఆదేశించారు. దీంతో కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యంతో సౌత్ ఆఫ్రికాకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న స్టెల్లా ఎల్ పనమా నౌక ను అధికారులు సీజ్ చేశారు. పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణ అవుతున్న తీరుపై పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ ల ఆదేశాలతో కీలక శాఖలతో ఏర్పాటైన అధికారుల బృందం కూడా మరోసారి ఆ నౌకలో తనిఖీలు చేపట్టింది. బియ్యం శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించారు. ఈ వివాదం కొనసాగుతుండగా తాజాగా కాకినాడ డీప్ వాటర్ పోర్టులో రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నాయన్న సమాచారం మరింత సంచలనంగా మారింది. 

Tags:    

Similar News