ఏపీలో రేషన్ కార్డు ఉన్నోళ్లకు తీపికబురు
రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు తెలిపింది.
దిశ, డైనమిక్ బ్యూరో : రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. రేషన్ కార్డులు ఉన్నవారికి కందిపప్పు పంపిణీ చేయానుంది. ఈ ఏడాది నవంబర్ నెల నుంచి క్రమం తప్పకుండా లబ్దిదారులకు కిలో చొప్పున కందిపప్పు అందించనుందని తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ 10 వేల టన్నుల కందిపప్పు కొనుగోలుకు హైదరాబాద్ అగ్రికల్చరల్ కో–ఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ (హాకా)కు ఆర్డర్ ఇచ్చినట్లు సమాచారం. అయితే హాకా దగ్గర కూడా తగినంత నిల్వలు లేకపోవడంతో 7,200 టన్నుల సరఫరాకు ఇటీవలే ప్రభుత్వం అంగీకరారం తెలిపిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా తొలి దశలో 3,660 టన్నులు, రెండో దశలో 3,540 టన్నులు అందించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల అవసరాల కోసం 2,300 టన్నుల సరఫరాకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా పప్పు ధాన్యాల కొరత ఏర్పడింది. దీంతో పప్పు ధాన్యాల రేట్లు విపరీతంగాపెరిగాయి. కందిపప్పుల నిల్వలు లేకపోవడంతో కందిపప్పు పంపిణీకి ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో కందిపప్పు రకాన్ని బట్టి రూ.150 నుంచి రూ.180 వరకు ఉంది. అయితే ప్రభుత్వం లబ్ధిదారులకు కిలో రూ.67 చొప్పున ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మిగిలిన రూ.70పైగానే సబ్సిడీగా ప్రభుత్వం భరించనుంది. వచ్చే ఏడాది జనవరి వరకు కిలో కందిపప్పు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం 50వేల టన్నుల కందిపప్పు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే.
Read More..