ఏపీ రాజధానికి అమరావతి పేరును ప్రతిపాదించింది రామోజీ రావే: చంద్రబాబు నాయుడు

రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు నేడు తుదిశ్వాస విడిచారు.

Update: 2024-06-08 11:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు నేడు తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ నేడు తెల్లవారుజామున 4. 50 గంటలకు మృతి చెందారు. రామోజీ రావు మృతి పట్ల ఎందరో రాజకీయ నాయకులు, సినీ నటులు ప్రగాడ సంతాపం తెలియజేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన భార్యతో కలిసి నేరుగా ఫిల్మ్ సిటీకి చేరుకుని రామోజీ భైతికకాయం వద్ద అంజలి ఘటించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం మీడియా వారితో మాట్లాడుతూ.. ఇంతటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని అన్నారు. అలాగే ఏపీ రాజధానికి అమరావతి పేరును ప్రతిపాదించింది రామోజీ రావేనని తెలిపారు. ఏపీ రాజధానికి ఏం పేరు పెట్టాలని ఆలోచిస్తుంటే.. అమరావతి పేరును రామోజీరావు ప్రతిపాదించారని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.


Tags:    

Similar News