అలర్ట్ : మరో మూడు రోజుల పాటు వర్షాలు

ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ కీల హెచ్చరికలు జారీచేసింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఏపీలోమరో

Update: 2023-03-21 02:02 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ కీల హెచ్చరికలు జారీచేసింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఏపీలోమరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడనున్నాయని తెలిపింది.

ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో 3 రోజుల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని,ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో ఎక్కు ప్రాంతాల్లో రాయలసీమలో ఒట్రెండు చోట్ల వానలు పడే అవకాశం ఉన్నట్లు వెళ్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. అందువలన ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.ఇప్పటికే అకాల వడగండ్ల వర్షాలతో పంట దెబ్బతిని రైతులకు నష్టం మిగిలిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News