చల్లని కబురు.. రానున్న మూడురోజుల్లో భారీవర్షాలు

ఏపీకి వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. ఉదయం తొమ్మిది అయితే చాలు, ఇంటి నుంచి కాలు బయట పెట్టడానికి అందరూ జంకుతున్నారు.

Update: 2023-05-21 14:24 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీకి వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. ఉదయం తొమ్మిది అయితే చాలు, ఇంటి నుంచి కాలు బయట పెట్టడానికి అందరూ జంకుతున్నారు. పలు జిల్లాల్లో ఏకంగా 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో వాతావరణశాఖ చల్లటి కబురు అందించింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

ఈ ఏడాది చివరి సూర్య, చంద్రగ్రహణాలు ఎప్పుడో తెలుసా?  

Tags:    

Similar News