అలర్ట్ : రానున్న రెండు రోజుల్లో మోస్తారు వర్షాలు
ఏపీకి వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుడం స్థిరంగా కొనసాగుతుండగా,
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీకి వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుడం స్థిరంగా కొనసాగుతుండగా, తమిళనాడు నాగపట్నానికి 570KM, చెన్నైకి ఆగ్రేయంగా 600కి.మీ దూరంలో కేంద్రీ కృతమై ఉంది. ఇది రానున్న 24 గంటల్లో శ్రీలంక మీదుగా కొమరిన్ వైపు వెళ్తుందని భారత వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎమ్‌డీ పేర్కొంది.