Rain Alert: ఏపీ ప్రజలకు రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు

ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది.

Update: 2024-03-21 14:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. రానున్న రెండు రోజుల్లో ఆయా జిల్లాలో పిడుగలతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాలపైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నందున పలు చోట్ల వర్షాలు పడనున్నాయి. అదేవిధంగా జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉన్న ద్రోణి బలహీన పడిందని పేర్కొన్నారు. వాటి ప్రభావంతో నేడు, రేపు ఉత్తర కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, దక్షిణ కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఈ మేరకు అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోన సీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడనున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. 

Read More..

Breaking: విజయవాడ సమీపంలో భారీ అగ్నిప్రమాదం

Tags:    

Similar News