Rain Alert:రాష్ట్రానికి మరో మూడు రోజులు రెయిన్ అలర్ట్..ఈ జిల్లాలో భారీ వర్షాలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

Update: 2024-09-03 10:00 GMT

దిశ,వెబ్‌డెస్క్:రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించడం వల్ల జన జీవనం స్తంభించిపోయింది. దీంతో వరద బాధితులను ఆదుకోవాలని రెండు రాష్ట్రాల సీఎంలు అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు సూచించారు. అసలు విషయంలోకి వెళితే..రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గుంటూరు, బాపట్లకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, యానాం, ఏలూరు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.


Similar News