నారాయణ అరెస్టు: పోలీసులు ఏం చేస్తారో చెప్పిన RRR

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి నారాయణ అరెస్టుపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు. Raghu Ramakrishna Raju responds on Ex Minister Narayana Arrest

Update: 2022-05-10 12:02 GMT

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి నారాయణ అరెస్టుపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు.ఆయన అరెస్టు ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ప్రశ్నాపత్రాల లీకేజి వ్యవహారంలో నారాయణను అరెస్టు చేయడం న్యాయమైతే.. సీఎం జగన్, విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణను అరెస్టు చేయడం కూడా న్యాయమేనంటూ ఎద్దేవా చేశారు. నారాయణను అరెస్టు చేశాక పోలీసులు ఏం చేస్తారో ఓ బాధితుడిగా నాకు తెలుసంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయంశంగా మారాయి.

'అరెస్టు చేశాక విచారణ పేరుతో కొడతారు. ఇంటరాగేషన్ చేసే రూమ్స్ లో సీసీ కెమెరాలు తీసేస్తారు. వ్యక్తిగత సిబ్బందిని కూడా బయటకు పంపిస్తారు. తర్వాత బయటకొచ్చి పాచి అబద్దాలు ఆడతారు. నారాయణ ఎంత ఫిట్ గా ఉన్నారో తెలియదు. రెండుమూడు దెబ్బలు వేయగానే ఏమైనా జరగొచ్చు. ఆయనను అభిమానించేవారు అలర్ట్ గా ఉండాలి. ఈ అధికార పార్టీ నేతలు ఎంతకైనా తెగిస్తారు. వెంటనే కోర్టును ఆశ్రయించండి' అంటూ హితవు పలికారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రభుత్వంపై ప్రశ్నిస్తే భయబ్రాంతులకు గురి చేయడానికే అధికార పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవాళ్ళు నారాయణ అరెస్టును ఖండిచాలంటూ రఘురామ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News