Ap News: వేడెక్కుతున్న రాజకీయాలు.. పోటా పోటీగా పంచ్ డైలాగ్స్?
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో పోటాపోటిగా ఫిర్యాదులు, ఆరోపణలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాజకీయ పార్టీల నాయకులతో పాటు అధికారులు కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో పోటాపోటీగా ఫిర్యాదులు, ఆరోపణలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాజకీయ పార్టీల నాయకులతో పాటు అధికారులు కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. దీంతో ఈసీకి భారీ సంఖ్యలో నోటీసులు వెళుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాత్ర పరిమితంగానే ఉంటుంది. ఎన్నికల నిర్వహణలో అధికారులు, పోలీసుల పాత్ర కీలకం. ఈ క్రమంలో కొందరు రాజకీయ నేతలు ఐపీఎస్‌లపై చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఐపీఎస్‌లను అవమానించేలా చేస్తున్న ఆరోపణలను ఈసీ దృష్టికి తీసుకెళ్తామని ఐపీఎస్‌ల అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తెలిపారు.
అంతేకాదు కొందరు రాజకీయ నేతలు చేస్తున్న ఆరోపణలు పోలీస్ యంత్రాంగాన్ని నిరుత్సాహపర్చేలా ఉంటున్నాయని ఆరోపించారు. ఈ క్రమంలో టీడీపీ నేతల బృందం చంద్రబాబు పై, ఇతర నేతలపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని కోరుతూ డీజీపీని కలిశారు. టీడీపీ నేతలపై దాడులపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని పార్టీ నేతలు ఆరోపించారు. అన్ని పార్టీల నేతల పట్ల సమానంగా వ్యవహరించాల్సిన పోలీసులు వైసీపీకి వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇది ఇలా ఉంటే..వైసీపీ నేతలు సీఎం జగన్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ విధంగా ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
Read More..