Visakhapatnam : విశాఖలో బంగ్లా విద్యార్థులకు వ్యతిరేకంగా నిరసన

Update: 2024-12-01 10:26 GMT

దిశ, వెడ్ డెస్క్ :   విశాఖ పట్టణం(Visakhapatnam)లో బంగ్లాదేశ్ విద్యార్థుల(Bangladeshi students)కు వ్యతిరేకంగా జన జాగరణ సమితి(Jana Jagarana Samithi) ఆందోళన(Protest)నిర్వహించింది. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు, హింసను నిరసిస్తూ ఏయూ ఇంటర్నేషనల్ హాస్టల్ వద్ద జన జాగరణ సమితి ఆందోళన చేపట్టింది. ఏయూ ఇంటర్నేషనల్ హాస్టల్లో ఉన్న బంగ్లాదేశ్ విద్యార్థులు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. గెట్ అవుట్ అంటూ బ్యానర్లు ప్రదర్శించారు.

ఆందోళన చేస్తున్న జన జాగరణ సమితి నిరసన కారులను పోలీసులు అడ్డుకున్నారు. అయితే తాము అల్లరి చేయడానికి రాలేదని.. బంగ్లాదేశ్ విద్యార్థులకు వ్యతిరేరకంగా నిరసన వ్యక్తం చేయడం ద్వారా బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ప్రపంచానికి తెలియచెప్పాలనుకున్నామని జనజాగరణ కార్యకర్తలు వెల్లడించారు.

Tags:    

Similar News