సీఎం అపాయింట్మెంట్ కోరాం.. అన్ని వివరిస్తాం: అల్లు అరవింద్
సినీ ఇండస్ట్రీ సమస్యలపై త్వరలో చంద్రబాబును కలుస్తామని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు...
దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను టాలీవుడ్ నిర్మాతలు కలిశారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో పవన్ కల్యాణ్‌తో నిర్మాతలు శ్రీ అల్లు అరవింద్, శ్రీ సి అశ్వినీదత్, శ్రీ ఏ.ఎం. రత్నం, శ్రీ ఎస్.రాధాకృష్ణ (చినబాబు), శ్రీ దిల్ రాజు, శ్రీ బోగవల్లి ప్రసాద్, శ్రీ డి.వి.వి.దానయ్య , శ్రీమతి సుప్రియ, శ్రీ ఎన్.వి.ప్రసాద్, శ్రీ బన్నీ వాసు, శ్రీ నవీన్ ఎర్నేని, శ్రీ నాగవంశీ, శ్రీ టి.జి.విశ్వప్రసాద్, శ్రీ వంశీ కృష్ణ తదితరులు భేటీ అయ్యారు. కొంత సేపు చర్చించారు. భేటీ ముగిసిన సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు.
Read More..
AP News:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సినీ నిర్మాతల భేటీ
సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోరామని, ఖరారు అయిన తర్వాత ఆయన్ను కలుస్తామని తెలిపారు. అప్పుడు అన్నింటికి సంబంధించి రిప్రజంటేషన్ ఇస్తామని చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం సంతోషంగా ఉందన్నారు. డిప్యూటీ సీఎం అయినందుకు పవన్ కల్యాణ్‌కు విసెష్ తెలిపామన్నారు. టికెట్ల రేట్లు చాలా చిన్న విషయమని చెప్పారు. త్వరలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలుస్తామని అల్లు అరవింద్ పేర్కొన్నారు.