మద్యం మత్తులో దారుణం.. మహిళపై లైంగిక దాడి, హత్య
రాష్ట్రంలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు ఓ మహిళపై లైంగిక దాడి(sexual assault)కి పాల్పడి, హత్య చేశారు.
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు ఓ మహిళపై లైంగిక దాడి(sexual assault)కి పాల్పడి, హత్య చేశారు. ఈ దారుణమైన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కడియం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడియం ప్రాంతంలో బుర్రిలంక నర్సరీలో ఓ వివాహిత పనిచేస్తుంది. అయితే రాత్రి మద్యం సేవించిన నలుగురు యువకులు మత్తులో ఉండి.. నర్సరీ లో ఉన్న వివాహితపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం మహిళను హత్య చేసి.. పక్కనే ఉన్న కాలువలో పడేశారని తెలిపారు. కాగా గత నెల 15న చొప్పెల్ల లాకుల వద్ద అనుమానాస్పద స్థితిలో మృతదేహం కాలువలో లభించింది. అనంతరం మహిళ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా.. రిపోర్ట్‌లో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తేలింది. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించి.. బుర్రిలంకకు యేసులోకి జయప్రసాద్, వెలుబుడి ప్రవీణ్, పొట్టిలంకకు చెందిన దాసరి సురేష్‌ను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. వీరంతా మద్యం మత్తులో ఆమెపై క్రూరంగా లైంగికదాడి చేసి ఆ తర్వాత హతమార్చారు.