ఒకే వేదికపై ప్రధాని నరేంద్రమోడీ, పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్రమోడీ నేడు ఒకేవేదికపై ఆశీనులు కానున్నారు.

Update: 2023-11-07 05:58 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్రమోడీ నేడు ఒకేవేదికపై ఆశీనులు కానున్నారు. 2014 ఎన్నికల్లో వీరిద్దరూ ఒకే వేదికపై ప్రత్యక్షమయ్యారు. అనంతరం ఇప్పటి వరకు ఒకే వేదికను పంచుకున్న దాఖలాలు లేవు. అయితే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే బీసీ ఆత్మగౌరవ సభ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభకు ప్రధాని నరేంద్రమోడీతోపాటు రాష్ట్రానికి చెందిన బీజేపీ అతిరథ మహారథులు హాజరుకానున్నారు. వీరితోపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం తమ పార్టీ నేతలతో కలిసి వేదికపంచుకోనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీసీ ఆత్మగౌరవ సభను బీజేపీ చాలా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో నేటి సభలో ప్రధాని మోడీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇకపోతే జనసేన పార్టీ బీజేపీతో పొత్తు నేపథ్యంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎలాంటి ప్రసంగం చేస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఇలాంటి తరుణంలో పవన్ కల్యాణ్ వారికి ఎలాంటి కౌంటర్ ఇస్తారోనన్న ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News