ఏపీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధాని మోడీ సంచలన ట్వీట్
ఏపీలో గెలుపుపై ప్రధాని మోడీ సంచలన ట్వీట్ చేశారు...
దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల వేళ ప్రధాని మోడీ ట్వీట్ సన్సేషన్ సృష్టిస్తోంది. ఏపీ ఎన్నికల్లో ఆయన రాజమండ్రి, అనకాపల్లిలో కూటమి అభ్యర్థుల తరపున ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఏపీలో కూటమి గెలవబోతోందని తెలిపారు. అయితే సభ అనంతరం రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలపై ఆయన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆసక్తికర ట్విట్ పెట్టారు. ‘కూటమికి ఏపీలో ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. ఈ ఆదరణతో ప్రత్యర్థులకు నిద్ర పట్టడంలేదు. ఏపీలో ఎన్డీయే గాలి వస్తోంది.’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
ఇక రాజమండ్రి, అనకాపల్లి సభలో పాల్గొన్న ప్రధాని మోడీ.. ఏపీకి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సీఎం జగన్ పోలవరాన్ని పూర్తి చేయకపోవడంపై ఆయన విమర్శలు కురిపించారు. అలాగే రాష్ట్రంలో అవినీతి పెచ్చుమీరిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.