ఎన్డీఏలోకి చంద్రబాబు రీ ఎంట్రీపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ అధినేత చంద్రబాబు రీ ఎంట్రీపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేన-బీజేపీ చిలకలూరిపేటలో ఇవాళ

Update: 2024-03-17 12:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ అధినేత చంద్రబాబు రీ ఎంట్రీపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేన-బీజేపీ చిలకలూరిపేటలో ఇవాళ ప్రజాగళం పేరుతో భారీ బహిరంగా సభ నిర్వహించాయి. ఈ సభలో మోడీ మాట్లాడుతూ.. చంద్రబాబు రీ ఎంట్రీతో ఎన్డీయే కూటమి మరింత బలపడిందని అన్నారు. చంద్రబాబు, పవన్‌ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కష్టపడుతున్నారని పొగిడారు. ఎన్డీయే ఎంపీ అభ్యర్థులను గెలిపించండి.. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని.. ఇది మోడీ గ్యారెంటీ అని హామీ ఇచ్చారు.

ఏపీ ప్రజలకు ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. మా హయాంలో ఏపీ ఎడ్యుకేషన్ హబ్‌గా మారిందని గుర్తు చేశారు. అనేక జాతీయ విద్యాసంస్థలను ఏపీకి తీసుకొచ్చామని చెప్పారు. దేశ అభివృద్ధితో పాటు ఏపీ అభివృద్ధి మా లక్ష్యమని స్పష్టం చేశారు. జూన్‌ 4న ఫలితాల్లో ఎన్డీయేకు 400 సీట్లు దాటాలి.. డబుల్ ఇంజిన్‌ సర్కార్‌తోనే మన లక్ష్యాలు నెరవేరుతాయి.. పేదల కోసం ఆలోచించేది ఎన్డీయే ప్రభుత్వమేనని అన్నారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది.. పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారని చెప్పారు. 

Read More..

Prajagalam Sabha: చిలకలూరిపేట సభలో తెలుగులో ప్రసంగించిన మోడీ 

Tags:    

Similar News