రేపే NTR వంద నాణెం విడుదల.. రాష్ట్రపతి చేతుల మీదుగా ఆవిష్కరణ
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నాణాన్ని ముద్రించింది. సోమవారం (ఈనెల 28న) ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేయనున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నాణాన్ని ముద్రించింది. సోమవారం (ఈనెల 28న) ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు కేంద్రం ఆహ్వానం పంపగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, కల్యాణ్ రామ్, సుహాసినితో పాటు పలువురు ఢిల్లీకి వెళ్లారు. ఎన్టీఆర్‌తో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులను సైతం సైతం ఆహ్వానించడంతో వెళ్లినట్లు సమాచారం.
44 మిల్లీ మీటర్ల చుట్టుకొలతతో ఉండే ఈ వంద రూపాయిల నాణాన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేశారు. అలాగే ఈ నాణానికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించారు. ఆయన శతజయంతి ఈ ఏడాదితో ముగియడంతో 1923- 2023 అని ముద్రించారు.