ఒంగోలులో భూ కబ్జా.. ఎట్టకేలకు సీఎం జగన్‌తో చర్చించిన వైసీపీ ఎమ్మెల్యే

సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరావు కలిశారు...

Update: 2023-11-02 14:45 GMT

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరావు కలిశారు. ఒంగోలులో భూ కబ్జా ఘటనలో జరిగిన పరిణామాలపై ఎమ్మెల్యే బాలినేని తీరు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అంతేకాదు ఒంగోలు ఎస్పీకి, ఆయనకు పడటం లేదనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అసలు డైరెక్ట్‌గా సీఎం జగన్‌ను కలిసి వివరించాలని బాలినేని అనుకున్నారు. ఈ మేరకు ప్రయత్నాలు చేశారు. అయితే బాలినేనికి జగన్‌ అపాయింట్ మెంట్ ఇవ్వలేదనే ప్రచారం జరిగింది. కానీ తాజాగా సీఎం జగన్‌తో బాలినేని భేటీ అయ్యారు. ఒంగోలు భూ కబ్జా వ్యవహారంపై చర్చించారు. సీఎంతో భేటీ తర్వాత ఎమ్మెల్యే బాలినేని మీడియాతో మాట్లాడారు. నకిలీ డాక్యుమెంట్స్ వ్యవహారంలో సిట్ ఏర్పాటు చేయాలని కోరింది తానేనని స్పష్టం చేశారు. ఎస్పీకి, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని వెల్లడించారు. తనపై లేనిపోని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. మళ్లీ అలాంటి ఆరోపణలు చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. తాను ఎవరి జోలికి వెళ్లనని, తన జోలికి ఎవరొచ్చినా ఊరుకోనని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఒంగోలు నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల సమస్యలపై జగన్‌కు వివరించినట్లు తెలిపారు. ఒంగోలులో త్వరలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని.. ఆ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారని బాలినేని తెలిపారు.

Tags:    

Similar News