కృష్ణానదికి పోటెత్తిన వరద.. ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత

కృష్ణ నదికి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ఉధృతంగా ప్రవహిస్తుంది.

Update: 2024-08-29 05:22 GMT

దిశ, వెబ్ డెస్క్: కృష్ణ నదికి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో నదిపై ఉన్న జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, టైల్ పాండ్, పులిచింత ప్రాజెక్టులు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణ నదిపై చివరలో ఉన్న ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. 70 గేట్లను 2 అడుగుల మేర ఎత్తారు. దీంతో సముద్రంలోకి 99,050 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. అలాగే కాలువలకు 17,229 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నీటిమట్టం 12 అడుగులు కాగా.. వచ్చిన నీటిని వచ్చినట్లే సముద్రంలోకి వదులుతున్నారు. 


Similar News