Deputy CM Pawan:పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ సినీ నటుడు భేటీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(Deputy CM Pawan Kalyan)తో ప్రముఖ సినీ నటుడు, డైరెక్టర్ పార్థిబన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

Update: 2024-10-27 13:59 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(Deputy CM Pawan Kalyan)తో ప్రముఖ సినీ నటుడు, డైరెక్టర్ పార్థిబన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ రోజు(ఆదివారం) సాయంత్రం మంగళగిరిలోని జనసేన కార్యాలయం(Janasena Office)లో సమావేశం జరిగింది. ఈ క్రమంలో వీరిద్దరూ పలు విషయాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. రాధాకృష్ణన్ పార్థిబన్(Radhakrishnan Parthiban) కోలీవుడ్‌లో సంచలన నటుడు. కాగా పార్థిబన్ దాదాపు 70కి పైగా సినిమాల్లో నటించారు. 16 సినిమాలకు దర్శకత్వం వహించారు. 14 సినిమాలకు(movies) నిర్మాతగా వ్యవహరించారు. టాలీవుడ్ సినీ రంగంతో కూడా ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. 1984లో డైరెక్టర్ కే భాగ్యరాజ్‌ దగ్గర ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌(Assistant Director)గా తన కెరీర్ ప్రారంభించారు.

Tags:    

Similar News