ఎన్నికలకు ముందే రూ.50 కోట్లు పంచుదాం.. ఎమ్మెల్యే రాచమల్లు సంచలన వ్యాఖ్యలు

ఏపీలో రాజకీయం వేడెక్కింది..

Update: 2024-01-31 16:07 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో రాజకీయం వేడెక్కింది. మరికొన్ని నేలల్లో ఎన్నికలు వస్తుండటంతో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. ఎన్నికల్లో డబ్బులు పంచకుండా గెలవాలనే చాలెంజ్‌లు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో ఓట్ల పంపిణీపై తాజాగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసి హీట్ పెంచారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయొద్దని, ఒక వేళ పంచాలనుకుంటే ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఆస్తుల అమ్మైనా సరే ఊరంతా డబ్బులు పంచుదామని టీడీపీ నేతలకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. ఇందుకు తాను సిద్ధమని.. తమరు కూడా రెడీనా అని ఛాలెంజ్ చేశారు. ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా పంచకుండా ఎన్నికలకు వెళ్దామని సవాల్ విసిరారు. రూ. 50 కోట్లు కాకపోతే సర్వం ఆస్తులు అమ్మి అయినా డబ్బులు పంచుదామని చెప్పారు. ఓట్ల కోసం కాకుండా ప్రజా సేవ కోసం ఇద్దరి ఆస్తులు అమ్మి అయినా మీడియా ముఖంగానే ఊరందరికి పంచుతామన్నారు. తన యావదాస్తి అమ్మితే రూ.70,80 కోట్లు వస్తుందని.. టీడీపీ నేత ప్రవీణ్ కుమార్  ఆస్తులు అమ్మితే రూ.1000 కోట్లు వస్తుందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 


Similar News