AP Assembly Photos : ఓకే.. రెడీ.. స్మైల్ ప్లీజ్..

అమరావతిలోని ఏపీ అసెంబ్లీ ఆవరణలో మంగళవారం ఫొటో సెషన్కా ర్యక్రమం నిర్వహించారు.

Update: 2025-03-18 10:41 GMT
AP Assembly Photos : ఓకే.. రెడీ.. స్మైల్ ప్లీజ్..
  • whatsapp icon

 ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఫోటో సెషన్

 సంభాషణలతో నవ్వుల పువ్వులు

 మంత్రులు, ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల సందడి

దిశ డైనమిక్ బ్యూరో: అమరావతిలోని ఏపీ అసెంబ్లీ ఆవరణలో మంగళవారం ఫొటో సెషన్ (Photo session) కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, శాసనమండలి చైర్మన్ మోషేన్‌రాజు, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఏపీ ఎమ్మెల్సీల ఫొటో సెషన్ వేదికగా రాజకీయ సందడి నెలకొంది. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. డిప్యూటీ ఛైర్మన్ జాకియా ఖానం చంద్రబాబుతో మాట్లాడుతూ, మీతో ఫొటో దిగడం నా అదృష్టం అని వ్యాఖ్యానించారు. మరోవైపు, ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా కలిసి ఫొటో దిగాలని కోరారు. ఆయన అభ్యర్థనను సీఎం మన్నించి వెంటనే ఫొటోకు అవకాశం ఇచ్చారు.

సరదా వ్యాఖ్యలు..

మండలిలో ఛైర్మన్ తమకు సరిగా మైక్ ఇవ్వడం లేదని నారా లోకేష్ సీఎం, ఛైర్మన్ సమక్షంలో సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి సీఎం స్పందిస్తూ, పట్టుబట్టి మీరే మైక్ తీసుకోవాలి అని సూచించారు. ఫొటో సెషన్ ముందు వరుసలో అవకాశం ఉందా అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మండలి ప్రతిపక్ష నేతగా మీకు ముందు వరుసలో సీటు ఉందని చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ తెలిపారు. అయితే, బొత్స పొరపాటున వేరే కుర్చీలో కూర్చున్నారు. దీంతో డిప్యూటీ సీఎం సీటుకు ఇబ్బంది కలుగుతుందని గ్రహించిన మంత్రి నారా లోకేష్, బొత్సను లేపకుండా మరో కుర్చీ ఏర్పాటు చేయించారు.

Tags:    

Similar News