విషాదం.. ఇసుకాసురులు తవ్విన కయ్యలో పడి బాలుడి మృతి
అక్రమ సంపాదనే లక్ష్యంగా మామూళ్ళు ఇవ్వడమే ధ్యేయంగా చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు.

దిశ, కర్లపాలెం: అక్రమ సంపాదనే లక్ష్యంగా మామూళ్ళు ఇవ్వడమే ధ్యేయంగా చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో ఇసుకాసురులు తవ్విన కయ్యల్లో ఏర్పడిన ప్రదేశంలో నిలిచిన మురుగు నీటిలో ప్రమాదవశాత్తు పడి బాలుడు మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది.
స్థానికుల సమాచారం మేరకు కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన ఉన్నం ప్రవీణ్ (14) స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి అటుగా వెళ్ళగా, ఇసుకాసురులు తవ్విన కయ్యల్లో కాలుజారి పడిపోవడంతో, బాలుడికి ఈత రాక గుంతలో పడి విలవిలాడుకుంటూ మరణించాడు. బాలుడు తొమ్మిదో తరగతి వరకు చదివి, కుటుంబ పోషణ నిమిత్తం కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బాలుడి మరణ వార్త విని తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బాలుడు మరణవార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న కర్లపాలెం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read More..