Ap News: టీడీపీ నేతలతో పనేంటి..?.. కోటంరెడ్డిపై పేర్ని నాని ఆగ్రహం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నమ్మక ద్రోహం చేశారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. డిసెంబర్ 25న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారని ఆయన ఆరోపించారు...
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నమ్మక ద్రోహం చేశారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. డిసెంబర్ 25న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబుతో నిత్యం టచ్‌లో ఉన్నారని చెప్పారు. జగన్ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటే లోకేశ్‌తో ఎందుకు టచ్‌లో వెళ్లారో చెప్పాలని నిలదీశారు. అయినా తమ పార్టీ ఎమ్మె్ల్యేలపై తామెందుకు నిఘా పెట్టుకుంటామని మాజీమంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. జగన్ అందర్నీ నమ్ముతారని, అలా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని నమ్మారని కానీ నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు. వైఎస్ జగన్ నమ్మి టికెట్ ఇస్తే టీడీపీ నేతలతో పనేంటని అని నాని ప్రశ్నించారు. పక్షులు వలస వెళ్లే కాలం ఇదని.. తాము కూడా విచారణ చేయమని అడుగుతున్నామన్నారు. లోకేశ్‌తో టచ్‌లో ఉండొచ్చా?. నిఖార్సుగా ఉంటే ఫోన్ ట్యాపింగ్‌తో భయం ఎందుకు. చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత నెల్లూరు నారాయణతో టచ్‌లో ఉండాలని కోటంరెడ్డికి చంద్రబాబు ఆదేశించారు.' అని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.
Read more: