ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తప్పకుండా రాజధాని ఫైల్స్ సినిమా చూడండి: చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ.. రాజధాని ఫైల్స్ సినిమా చూడాలని.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ.. రాజధాని ఫైల్స్ సినిమా చూడాలని.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వైసీపీ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాక అమరావతిపై కక్షగట్టి రాజధానిని నాశనం చేశారని ఫైర్ అయ్యారు. అలాగే.. అమరావతి రాజధానిగా ఉండాలని నిరసనలు వ్యక్తం చేసిన ఉద్యమకారులపై అధికారంతో హింసించారని.. రాజధానిలో విష ప్రచారం చేశారన్నారు. అలాగే.. సీఎం జగన్ కుట్రలు, కుతంత్రాలకు రాజధాని ఫైల్స్ సినిమా అద్దం పడుతోందన్నారు. ఈ సినిమా రిలీజ్ కాకుండా చేయాలని వైసీపీ ప్రభుత్వం చూసిందని.. కానీ వారి ఆటలు సాగలేదన్నారు.
ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి వాస్తవాలను తెలుసుకోవాలని చంద్రబాబు కోరారు. కాగా ఈ రాజధాని ఫైల్స్ సినిమాను.. అమరావతి కోసం భూములు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం వారిని ఏ విధంగా చూసింది. అనంతరం రాజధాని మార్పుతో ఆ ప్రాంత ప్రజల తిరుగుబాటు, వారిని ప్రభుత్వం ఏ విధంగా అనిచి వేసిందనే కాన్సెప్ట్‌లో తీశారు. ఈ సినిమాకు భాను శంకర్ దర్శకత్వం వహించగా.. కె రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమాలో.. అఖిలన్ పుష్పరాజ్, విశాల్ పతి, వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్ వంటి నటులు నటించారు.
Read More..
GSLV F14 Launch: రేపే జీఎస్ఎల్వీ ఎఫ్-14 ప్రయోగం.. కౌంట్‌డౌన్ ప్రారంభం