YS షర్మిల ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాస్‌గా బాధ్యతలు చేపట్టాక YS షర్మిల చేయబోయే ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాస్‌గా బాధ్యతలు చేపట్టాక YS షర్మిల చేయబోయే ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుత ప్రభుత్వమైన వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపైనా ఏవైనా విమర్శలు చేస్తారా? లేదా? అని అటు కాంగ్రెస్ నేతలతో పాటు ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సైతం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా, రాష్ట్ర విభజన తరువాత ప్రజల సెంటిమెంట్‌గా మిగిలిపోయిన పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై ప్రసంగంలో షర్మిల ప్రస్తావించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేయడం కోసం ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అంశాలపై సవివరంగా నివేదికలను తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఏపీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం, పార్టీలో చేరికలపై స్పష్టత ఇవ్వనున్నారు. దీంతో ఆమె స్పీచ్ కోసం రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.