కొటాలలో చిరుత సంచారం..బిక్కుబిక్కుమంటున్న ప్రజలు
టీవల ఏపీలో పలుచోట్ల చిరుత సంచారిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి చిరుత సంచరించడం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.
దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల ఏపీలో పలుచోట్ల చిరుత సంచారిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి చిరుత సంచరించడం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే..చంద్రగిరి కొటాల పంచాయితీలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలోని శేషాపురం వెలుపల ఉన్న జగనన్న కాలనీలో సాయంత్రం పని ముగించుకుని వస్తున్న కూలీలు పులిని చూసి షాక్ అయ్యారు. ఈ దృశ్యాలను కొందరు దూరం నుంచి ఫొటోలు తీసి పనపాకం ఎస్‌ఆర్‌ఓ అధికారికి సమాచారం అందించారు. దీంతో వారు ప్రజలను అప్రమత్తం చేశారు. పులి సంచారంతో చుట్టుపక్కల గ్రామస్తులు హడలెత్తి పోతున్నారు. ఈ క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆ ప్రదేశాలలో ఎవరు రాకూడదని అధికారులు సూచించారు.