టీడీపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ ప్రకటన: బీజేపీ రియాక్షన్ ఇదే
తెలుగుదేశం-జనసేనల మధ్య పొత్తు ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం-జనసేనల మధ్య పొత్తు ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ములాఖత్‌లో భాగంగా చంద్రబాబుతో భేటీ అయిన అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసే జనసేన ఎన్నికలకు వెళ్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కల్యాణ్ ప్రకటనపై బీజేపీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.‘ఏపీలో బీజేపీ, టీడీపీ,జనసేన పొత్తు ఉంటుందని పవన్ కల్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పొత్తుల అంశం బీజేపీ జాతీయ నాయకత్వం చూసుకుంటుంది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా అనేదానిపై కేంద్ర నాయకత్వం స్పష్టత ఇస్తుంది. పొత్తులను ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్ నిర్ణయిస్తారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీతో బీజేపీ పొత్తు కొనసాగుతోంది’ అని బీజేపీ అధిష్టానం ప్రకటించింది.