ఏపీ సచివాలయంలో పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్..ఆమెను అడ్డుకున్న పోలీసులు
ఏపీ సచివాలయంలో నేడు(మంగళవారం) దర్శనం ఇచ్చిన డిప్యూటీ సీఎం సన్నిహితురాలు. జనసేన పార్టీ నాయకురాలు కోట రుక్మిణి ఏపీ సచివాలయంలో కనిపించారు.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సచివాలయంలో నేడు(మంగళవారం) దర్శనం ఇచ్చిన డిప్యూటీ సీఎం సన్నిహితురాలు. జనసేన పార్టీ నాయకురాలు కోట రుక్మిణి ఏపీ సచివాలయంలో కనిపించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితురాలనే గుర్తింపు ఆమెకు ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరుగుతున్న సమయంలోనే ఆమె సచివాలయంలో కనిపించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కోట రుక్మిణి సచివాలయానికి రావడం ఇదే తొలిసారి. సచివాలయంలో ఆమె అడుగు పెట్టగానే పోలీసులు ఆమెను గుర్తుపట్టలేదు. దీంతో ఆమెను అడ్డుకున్నారు.
ఈ క్రమంలో కోట రుక్మిణిని లోపలికి వెళ్లడానికి అనుమతి లేదని తెలియజేశారు. ఆ సమయంలో ఆమె ఎవరికో ఫోన్ చేశారు. దీంతో కొద్ది సేపటికి పవన్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఛాంబర్ నుంచి ఆదేశాలు రావడంతో ఆమెను సచివాలయంలోకి అనుమతించారు. అయితే రుక్మిణి సచివాలయానికి ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే కొన్ని రోజుల ముందు పార్టీలో ఆమె పెత్తనం పెరిగిపోయిందని పలువురు జనసేన నేతలు విమర్శించారు. ఇప్పుడు ఏపీ సచివాలయంలో ఆమె కనపడటంతో అందరూ చర్చించుకుంటున్నారు.