Pawan Kalyan: మా దేవుడివి నువ్వే సామి.. డిప్యూటీ సీఎం ఫొటోకి పూజలు చేసి వరి నాట్లు(వీడియో)

సాధారణంగా మనం పొలంలో వరి నాట్లు వేసే ముందు మన కుల దేవత లేదా ఇష్టమైన దేవుడి ఫొటోకి పూజలు చేసి కొబ్బరి కాయ కొట్టి పంట మంచిగా పండాలని మొక్కుకొని ఆ తర్వాత నాట్లు వేయడం స్టార్ట్ చేస్తాము.

Update: 2024-08-25 03:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా మనం పొలంలో వరి నాట్లు వేసే ముందు మన కుల దేవత లేదా ఇష్టమైన దేవుడి ఫొటోకి పూజలు చేసి కొబ్బరి కాయ కొట్టి పంట మంచిగా పండాలని మొక్కుకొని ఆ తర్వాత నాట్లు వేయడం స్టార్ట్ చేస్తాము. ఇది ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీగా కూడా. అయితే దేవుడికి కాకుండా పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి ఏపీలో ఒక రైతు పూజలు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో పవన్ కళ్యాణ్‌కు కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు భక్తులు కూడా ఉన్నారంటూ చర్చ జరుగుతోంది.

బేసిక్‌గా తమిళనాడులో నటీనటులకు అభిమానులు గుడి కట్టి పూజలు చేయడం మనం చూశాము. ఇప్పుడు ఆ సంస్కృతి ఏపీకి పాకి ఏకంగా ఈ రైతు డిప్యూటీ సీఎం నువ్వే మా దేవుడివి అని మొక్కి పూజలు చేసి వరినాట్లు వేశారు. దీంతో ఈ వార్త వైరల్‌గా మారింది. కాగా మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి తన నటనతో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

Full View

(video link credits to nakshatra news youtube channel)


Similar News