రాష్ట్రంలో వైసీపీ మెలో డ్రామాలు, బ్లేమ్ గేమ్స్.. పవన్ కల్యాణ్ ఫైర్
ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్‌కు పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు...
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పింఛన్ల పంపిణీకి వాలంటీర్ల వినియోగించొద్దని ఈసీ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే వార్డు సచివాలయాల వద్ద పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. కానీ సరైన సౌకర్యాల లేక అవస్థలు పడుతున్నారు. దీంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, డయాలసిస్ పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇళ్ల వద్దనే పలు ఉద్యోగుల ద్వారా పింఛన్లు పంపిణీ చేయొచ్చని రాజకీయ నేతలు అంటున్నారు. అయినా సరే సచివాలయాలే వద్దే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఇందుకు కారణం టీడీపీ, జనసేన, బీజేపీ అని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ‘ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రెటరీ గారూ... వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ళ దగ్గర పింఛను అందించడానికి ఉన్న ఇబ్బంది ఏమిటి?. నా సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ దగ్గర రెవెన్యూ ఉద్యోగులకి డ్యూటీలు వేస్తారు.. తహశీల్దార్ నంబర్స్ ఇస్తారు. మరి పింఛన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా?. కరోనా కాలంలో మద్యం షాపుల దగ్గర ఉద్యోగులకి డ్యూటీ వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ రెవెన్యూ యంత్రాంగం ద్వారా పెన్షన్లు ఇళ్ళ దగ్గర ఇవ్వొచ్చు. వైసీపీ నాయకులు చేసే మెలో డ్రామాలకీ, బ్లేమ్ గేమ్స్‌కీ ప్రభుత్వ నిర్ణయాలు బలం ఇస్తున్నాయి.’ అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రెటరీ గారూ... వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ళ దగ్గర పింఛను అందించడానికి ఉన్న ఇబ్బంది ఏమిటి? పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ దగ్గర రెవెన్యూ ఉద్యోగులకి డ్యూటీలు వేస్తారు.. తహశీల్దార్ నంబర్స్ ఇస్తారు. మరి పింఛన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా?… pic.twitter.com/5VnX1BuWC4
— Pawan Kalyan (@PawanKalyan) April 3, 2024