జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్

జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పాల్గొన్నారు.

Update: 2024-09-11 17:43 GMT

దిశ, వెబ్ డెస్క్ : జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవిని, అటవీ సంపదను కాపాడటంలో ఫారెస్ట్ సిబ్బంది సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు. ఏపీ(AP)లో మాత్రమే ప్రత్యేకంగా పెరిగే శ్రీగంధం, ఎర్రచందనం లాంటి చెట్లను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిదని.. అరుదైన వృక్షాలను, వన్యప్రాణులను కాపాడుకోవడానికి మనం ప్రతిజ్ఞ చేద్దామని పవన్ కళ్యాణ్ అన్నారు. అటవీ సంరక్షణ విధుల్లో భాగంగా ప్రాణాలు అర్పించిన అమరులకు ఆయన నివాళులర్పించారు. కాగా రాజస్థాన్ లోని బిష్ణోయ్ (Bishnoy) తెగవారు అటవీ సంపదను కాపాడాటానికి చేసిన చారిత్రాత్మక త్యాగానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 11ను 'జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం'గా ప్రకటించింది.     


Similar News