బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు పవన్ కల్యాణ్ అండ.. ఒక్కొక్కరికి రూ.50వేలు సాయం

విశాఖ షిప్పింగ్ హార్బర్‌లో జరిగిన ప్రమాదంలో మత్స్యకారులు తమ బోట్‌లను కోల్పోయిన సంగతి తెలిసిందే.

Update: 2023-11-21 07:23 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖ షిప్పింగ్ హార్బర్‌లో జరిగిన ప్రమాదంలో మత్స్యకారులు తమ బోట్‌లను కోల్పోయిన సంగతి తెలిసిందే. తమకు జీవనాధారమైన బోట్లు ప్రమాదంలో బూడిదైపోయాయి. ఈ ఘటనపై స్పందించిన జనసేనాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు పవన్ కల్యాణ్ తీపికబురు చెప్పారు. విశాఖ షిప్పింగ్ హార్బర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు 60కి పైగా బోట్లు దగ్ధం అయిన ఘటనలో బాధితులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. నష్టపోయిన బోట్లయజమానులకు వారి కుటుంబాలకు జనసేన పార్టీ తరుపున నుండి రూ. 50,000 ఆర్దిక సాయం చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. వచ్చే రెండు మూడు రోజుల్లో తానే స్వయంగా వచ్చి పరిహారం అందజేస్తానని ట్విటర్ వేదికగా పవన్ కల్యాణ్ ప్రకటించారు. బాధిత కుటుంబాలకు జనసేన అండగా ఉంటుందని ట్విటర్ వేదికగా పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.

Read More..

ఏపీలో వారికి తీపికబురు.. ఒక్కొక్కరి ఖాతాలో రూ.69వేలు జమ చేసిన జగన్  

Tags:    

Similar News