యాక్షన్ స్టార్ట్.. ఫస్ట్ భేటీలోనే IAS ఆఫీసర్లకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం విజయవాడలోని డిప్యూటీ సీఎం

Update: 2024-06-19 11:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్‌లో పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న అనంతరం ఫస్ట్ టైమ్ జనసేనాని ఐఏఎస్ ఆఫీసర్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో మౌలిక వసతులు, రోడ్ల నిర్మాణం, మంచి నీటి ఎద్దడి అంశాలపై ఫోకస్ పెట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. మూడు నెలల తర్వాత పనుల పురోగతిపై సమీక్షిస్తానని అధికారులకు చెప్పారు. ప్రజా సమస్యలపై ఎట్టిపరిస్థితుల్లో నిర్లక్షం వహించొద్దని తేల్చి చెప్పారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుండి ఘన విజయం సాధించిన పవన్ కల్యాణ్.. చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీ డిప్యూటీ సీఎం పోస్ట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతలు స్వీకరించి యాక్షన్ స్టార్ట్ చేశారు. 


Similar News