కొడుకును మోడీకి పరిచయం చేసిన పవన్ కళ్యాణ్.. ఫ్యూచర్‌లో ఇంకో సింహం ఉందంటూ!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

Update: 2024-06-06 12:58 GMT

దిశ, సినిమా: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో ఏపీ ప్రజల్లో, మెగా ఫ్యాన్స్‌లో సంబరాలు అంభరాన్ని అంటాయి. సోషల్ మీడియా వేదికగా పోస్టులతో రచ్చ చేశారు. ఇదిలా ఉంటే.. మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉంది టీడీపీ.

ఈ మేరకు NDA భాగస్వయ్య పక్షాల భేటీ సందర్భంగా తాజాగా చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తన సతీమణి అన్నా లెజ్నెవాతో పాటు కొడుకు అకిరా నందన్‌ను కూడా తమతో ఢిల్లీ తీసుకెళ్లాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తన భార్యను, కొడుకు అకీరాను పరిచయం చేశాడు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా అకీరా నరేంద్ర మోడీ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ కావడంతో.. ‘ఫ్యూచర్‌లో ఇంకో సింహం ఉందని మర్చిపోవద్దూ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Tags:    

Similar News