వైరల్ అవుతోన్న పవన్ కల్యాణ్ ఎన్నికల అఫిడవిట్.. ఎన్ని కోట్లు పేర్కొన్నారో తెలుసా?

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈసారి పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-04-23 10:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈసారి పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గానే పిఠాపురంలో పవన్ ఇల్లు కూడా తీసుకున్నారు. కాసేపటి క్రితమే ఈయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా భారీ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. అయితే పవన్ కల్యాణ్ అఫిడవిట్‌లో తన ఐదేళ్ల ఆదాయం రూ. 114.76 కోట్లు అని పేర్కొన్నారు.

అప్పులు రూ.64 కోట్లుగా, ప్రభుత్వానికి చెల్లించిన పన్నులు రూ.73. 92 కోట్లు అని అఫిడవిట్‌లో వెల్లడించారు. అనంతరం మీడియాతో పవన్ మాట్లాడుతూ.. బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. 30,40 చోట్ల మా అభ్యర్థులకు సర్ది చెప్పామన్నారు. తన కోసం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ కీలక నేత వర్మ సైతం సీటు త్యాగం చేశారని తెలిపారు. రాష్ట్రం కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైనా సిద్ధమన్నారు. ఏపీలో కూటమి ఘనవిజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

Read More...

AP News:రాష్ట్రంలో కూటమి విజయం ఖాయం..తేల్చి చెప్పిన జనసేనాని! 

Tags:    

Similar News