ఇస్రో శాస్త్రవేత్తలు కనిపించని దేవుళ్ళు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

అతి తక్కువ ఖర్చుతో రాకెట్ ప్రయోగాలు చేస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలు దేశానికి నిజమైన హీరోలు అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

Update: 2024-08-13 17:27 GMT

దిశ, వెబ్ డెస్క్ : అతి తక్కువ ఖర్చుతో రాకెట్ ప్రయోగాలు చేస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలు దేశానికి నిజమైన హీరోలు అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుపతి లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో జరిగిన జాతీయ అంతరిక్ష ఉత్సవాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. రాకెట్ ప్రయోగాలు చేసే శాస్త్రవేత్తలు కనిపించని దేవుళ్లుగా కొనియాడారు. శాస్త్రవేత్తలను.. యువత, విద్యార్థులు ఆదర్శంగా తీసుకోని ప్రయోగాలు చేపట్టాలని కోరారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అంతరిక్ష ప్రయోగాలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందు ఉంటారని, ఆయన ప్రోద్భలంతోనే చంద్రయాన్ ప్రయోగాలు సక్సెస్ అయ్యాయని అన్నారు. అనంతరం స్పేస్ డే కార్యక్రమాల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. షార్ డైరెక్టర్ రాజరాజన్ చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగ నమూనాను పవన్ కు బహూకరించారు. 


Similar News