Breaking: మూడు రోజులుగా జలదిగ్బంధంలో పలుకురాతిపాలెం

అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ...

Update: 2024-07-27 11:17 GMT

దిశ, వెబ్ డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది.చాలా గ్రామాలకు కరెంట్ సరఫరా సైతం నిలిచిపోయింది. మూడు రోజులుగా అడ్డతీగల మండలం పలుకురాతిపాలెం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో రాకపోకలు పూర్తి నిల్చిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడ్డతీగల మండల కేంద్రానికి 5 కిలో మీటర్ల దూరంలో పలుకురాతిపాలెం ఉంది. ఈ గ్రామంలో వంతెన నిర్మిస్తామని నేతలు పలుమార్లు హామీ ఇచ్చారు. అనంతరం మర్చిపోయారు. దీంతో రాకపోకలు సాగించడానికి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తాళ్ల సాయంతో  గ్రామం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. మరోవైపు మారేడుమిల్లి వద్ద సున్నంపాడు సమీపంలోని నూరుకుడి గ్రామానికి వెళ్లే కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక్కడ కూడా గ్రామస్తులు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

Tags:    

Similar News