Breaking: పల్నాడు జిల్లా రెంటచింతలలో ఉద్రిక్తత
పల్నాడు జిల్లా రెంటచింతలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది...
దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా రెంటచింతలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో రెండు వర్గాలు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఈ దాడుల్లో వైసీపీకి చెందిన రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ముగ్గురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీంచారు. రెండు వర్గాల నాయకులు, కార్యకర్తలను కట్టడి చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ఇతరులెవరూ రెంటచింతలలో ఉండొద్దని హెచ్చరించారు.