చంద్రబాబు మీడియాతో మాట్లాడొద్దు.. రాజకీయం ప్రసంగం చేయకుండా ఆదేశించండి: ఏపీ హైకోర్టులో సీఐడీ పిటిషన్

స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ లభించిన సంగతి తెలిసిందే.

Update: 2023-10-31 10:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అనారోగ్యం కారణాల నేపథ్యంలో నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఐదు షరతులతో బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం చంద్రబాబు నాయుడు విడుదల కానున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశారు జైలు సిబ్బంది. అయితే చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సీఐడీ ఆంక్షలు విధించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇద్దరు సీఐడీ డీఎస్పీలను నిరంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అనుసరించే విధంగా చూడాలని కోరింది. అలాగే చంద్రబాబు నాయుడు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని ఆంక్షలు విధించాలని కోరింది. ఎటువంటి రాజకీయ ర్యాలీలు, ప్రసంగాలు చేయకూడదని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలని హై కోర్టులో సీఐడీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. మధ్యంతర బెయిల్ అనారోగ్య కారణాల రీత్య ఇచ్చారని పిటిషన్‌లో పేర్కొంది. కేవలం చికిత్సకు మాత్రమే ఆయన పరిమితం అయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టులో సీఐడీ పిటీషన్ దాఖలు చేసింది. 

Read More..

చంద్రబాబుకు మరో బిగ్ రిలీఫ్: ఆ కేసులో చర్యలు తీసుకోబోమన్న సీఐడీ 

Tags:    

Similar News